Tirumala : తిరుమల నేడు వెళ్లే వారికి గుడ్ న్యూస్...సులువు దర్శనం
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య వేసవి కాలంలో ఎక్కువగా ఉంటుంది. వేసవి తీవ్రత ముదరక ముందే తిరుమలేశుడిని దర్శించుకుని వెళ్లేందుకు భక్తులు అత్యధిక సంఖ్యలో తరలి వస్తున్నారు. అయితే గతరెండు రోజుల నుంచి ఎండల తీవ్రత ఎక్కువ కావడంతో కొంత రద్దీ తగ్గింది. ఆదివారం కూడా భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. సోమవారం మరింతగా భక్తుల సంఖ్య తక్కువయ్యే అవకాశాలున్నాయని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
హుండీ ఆదాయం...
భక్తుల సంఖ్య తగ్గుతున్నా శ్రీవారి హుండీ ఆదాయం మాత్రం తగ్గడం లేదు. రోజుకు నాలుగు కోట్ల రూపాయల మేరకు ఆదాయం వస్తుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య ఈ నెల నుంచి మరింత ఎక్కువగా ఉంటుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకోసం ముందస్తు ఏర్పాట్లు చేశామని, భక్తులు ఇబ్బందులు పడకుండా అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని టీటీడీ అధికారులు తెలిపారు.
పది కంపార్ట్ మెంట్లలోనే...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 80,774 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 27,447 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.05 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.