lunar eclipse : చంద్రగ్రహణం రోజు ఆచరించాల్సిన నియమాలివే.. దోష నివారణకు సూచనలివే

ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చం

Update: 2026-03-03 02:26 GMT

ఈరోజు చంద్రగ్రహణం ఏర్పడనుంది. చంద్ర గ్రహణం మంగళవారం,పుబ్బ నక్షత్రం, కేతు గ్రస్తము ఉంది. చంద్రగ్రహణం పట్టు సమయం మధ్యాహ్న 3.20 గంటలు. విడుపు సమయం సాయంత్రం 6.47 గంటలని పండితులు చెప్పారు. చంద్రగ్రహణం సందర్భంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ ఆచారాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు. చంద్రగ్రహణం సాధారణంగా రాత్రి వేళ వస్తుంది. కానీ ఇతర దేశాల్లో ఈ గ్రహణం ఎక్కువగా కనిపిస్తుంది కనుక ఇండియాలో పగటి వేళ చంద్రగ్రహణం పట్టు, విడుపు సమయాలను ప్రకటించారు. అందుకే నేడు రాష్ట్రంలోని దేవాలయాలను ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకూ మూసివేస్తారు.తర్వాత ఆలయ సంప్రోక్షణ తర్వాత ఆలయ ద్వారాలను ఈరోజు రాత్రికి తెరుచుకుంటాయి.

ఆలయాలు మూత...
ఉదయం 9.20 గంటల నుంచి గ్రహణం ప్రారంభం అవుతుంది.ఉదయం 09.20 గంటల నుంచి 7.30 గంటల వరకు భోజనము చేయరాదు. గర్భవతులు, వృద్దులు పగలు పదకొండు గంటల నుంచి పాటించ వలెను. పట్టు స్నానం పగలు 3.15 గంటలకు. విడుపు స్నానం సాయంత్రం 6.50 గంటల వరకు ఉందని పండితులు సూచిస్తున్నారు. ఈరోజు ఉదయం ఆరు గంటలకు దేవాలయములలో పూజ చేసి మూసి వేయాలని చెబుతున్నారు.మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్ర జాతకులు మరియు వృషభం, సింహం, కన్య, మకర రాశుల వారికి దోషాలు ఉంటాయని అంటారు. దోషాలు తొలగిపోవడానికి దానాలు సమర్పిస్తే సరిపోతుందని పండితులు సూచిస్తున్నారు.
దోషాలు తొలగాలంటే...
మఘ, పుబ్బ, ఉత్తర నక్షత్రం వాళ్లు,దోష నివారణకు చంద్ర బింబం, నాగబింబం లను కంచు లేక రాగి పాత్రలో పూజించి, నువ్వులు,తెల్ల వస్త్రం, దక్షిణతో దానం ఇవ్వవల్సి ఉంటుంది. దానం ఇవ్వలేని వాళ్ళు రావి చెట్టుకు 21 ప్రదక్షిణములు చేసిన కూడ దోషము తొలగి పోతుందని పండితులు సూచిస్తున్నారు.ఈ గ్రహణం భారత దేశంలో అంతటా కనిపిస్తుంది. దేవాలయములు రాత్రి మూసి ఉంచి మరునాడు శుద్ధి చేసి, తర్వాత సంప్రోక్షణ చేసి యాథా విది పూజలు చేయవచ్చునని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం సందర్భంగా పట్టు నుంచి విడుపు సమయంలో తమ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటే మంచిదని పండితులు సూచిస్తున్నారు. గ్రహణం అనేది ప్రతి సంవత్సరం వస్తుందని, అంతే కాని అపోహలకు పోవద్దని కూడా సూచిస్తున్నారు.


Tags:    

Similar News