Tirumala : తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ.. శిలాతోరణం వరకూ క్యూ లైన్

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది.

Update: 2026-03-02 03:29 GMT

తిరుమలలో భక్తుల రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. అన్ని కంపార్ట్ మెంట్లు కూడా భక్తులతో నిండి పోయి బయట వరకూ క్యూ లైన్ విస్తరించింది. తిరుమలలో భక్తుల రద్దీ గత వారమంతా కొనసాగింది. నేడు కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలి రావడంతో తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.భక్తులకు ఇబ్బందులు పడకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. క్యూ లైన్ లో ఉన్న వారికి అన్న ప్రసాదం, మజ్జిగ, పాలు, మంచినీటిని నిరంతరాయంగా పనిచేస్తున్నారు.

రేపు చంద్రగ్రహణం కావడంతో...
రేపు చంద్రగ్రహణం కావడంతో తిరుమల ఆలయాన్ని మూసివేయనున్నారు. అందుకోసం ఈరోజు అధిక సంఖ్యలో తిరుమలకు భక్తులు వచ్చి తమ మొక్కులు తీర్చుకుంటున్నారు. రేపు చంద్రగ్రహణం సందర్భంగా దాదాపు పది గంటల పాటు ఆలయాన్ని మూసివేస్తారు. తిరిగి సంప్రోక్షణ తర్వాత మాత్రమే ఆలయ ద్వారాలు తెరుచుకుంటాయి. నిన్నటి నుంచే నేడు, రేపటికి ఎస్.ఎస్.డి. టోకెన్ల జారీని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు నిలిపివేశారు. ఎల్లుండి కోసం టోకెన్లు జారీ చేయనున్నట్లు అధికారులు ప్రకటించారు.
అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్ మెంట్లు భక్తులతో నిండిపోయాయి. కంపార్టుమెంట్లన్నీ నిండి శిలాతోరణం క్యూలైన్ వరకు వేచి ఉన్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం పది హేను గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు ఆరు గంటల సమయం పడుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 83,112 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 30,054 మంది భక్తులు తమ మొక్కుల చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.49 కోట్లు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News