Tirumala : నేడు తిరుమలకు వెళుతున్నారా? క్యూ లైన్ లు ఎంత పొడవంటే?

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది

Update: 2026-04-13 03:39 GMT

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగానే ఉంది. నిన్నటి రద్దీ నేడు కూడా కొనసాగుతుంది. భక్తుల రద్దీ సహజంగా ఆదివారం నాటి భక్తుల సంఖ్య సోమవారం కూడా కొనసాగుతుంది. మరొకవైపు పరీక్ష ఫలితాలు వెల్లడి కావడంతో ఎక్కువ మంది శ్రీవారికి మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. వేసవి తీవ్రత ఎక్కువగా ఉండటంతో భక్తులు ఇబ్బందులు పడకుండా, ఎండ వేడిమిని తట్టుకునేలా అవసరమైన చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టారు.

ఉదయం ఐదు గంటలకు...
భక్తుల రద్దీ దృష్ట్యా ప్రతీరోజు ఉదయం ఐదు గంటలకు ఎస్.ఎస్.డి టోకెన్లుఇస్తున్నారు.తిరుపతిలో టోకెన్లు ఇచ్చే ప్రదేశాలు శ్రీనివాసం - RTCబస్టాండ్ దగ్గర, విష్ణు నివాసం -రైల్వే స్టేషన్ ఎదురుగా భూదేవి కాంప్లెక్స్ - అలిపిరి దగ్గర, శ్రీవారి మెట్టు శ్రీవారి మెట్టు మార్గం భక్తులకు ప్రతి రోజు అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్ లో టోకెన్స్ ఇస్తారు, అక్కడ తీసుకున్న టోకెన్ ని శ్రీవారి మెట్టు మార్గంలో 1200వ మెట్టు వద్ద తప్పనిసరిగా స్కానింగ్ చేయించుకోవాలని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు.
ఇరవై కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఇరవై కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వ దర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. నిన్న తిరుమల శ్రీవారిని 77,743 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 30,276 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.59 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు తెలిపారు.


Tags:    

Similar News