Tirumala : తిరుమలలో తగ్గిన రద్దీ.. స్వామి వారి దర్శనం సులువు
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఆదివారం అయినా భక్తుల రద్దీ తక్కువగానే ఉంటుంది. సాధారణంగా శుక్రవారం నుంచి రద్దీ మొదలయి సోమవారం వరకూ తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. తిరుమలకు వచ్చే వారి సంఖ్య ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగింది. స్వామి వారి హుండీ ఆదాయం కూడా గతంలో కంటే గణనీయంగా పెరిగింది. భక్తుల రద్దీకి అనుగుణంగా అవసరమైన అన్ని రకాల ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేస్తున్నారు.అయితే సంక్రాంతి సెలవులు ఉన్నప్పటికీ సొంతూళ్లకు వెళ్లి పండగను సెలబ్రేట్ చేసుకునే వారు ఎక్కువగా ఉన్నారు.
వసతి గృహాలు కూడా...
తిరుమలలో భక్తుల రద్దీ తక్కువగా ఉండటంతో వసతి గృహాలు కూడా సులువుగా దొరుకుతున్నాయి. ముందుగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకున్న వారు తిరుమలకు చేరుకుని తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో పొంగల్ కు ఎక్కువ ప్రాధాన్యత ఉండటంతో తిరుమలకు వచ్చే వారి సంఖ్య తక్కువగా ఉందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చెబుతున్నారు. సంక్రాంతి పండగ పూర్తయ్యే వరకూ ఇలాగే తక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకు వస్తారని అంటున్నారు.
ఎనిమిది కంపార్ట్ మెంట్లలో...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని ఎనిమిది కంపార్ట్ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనం క్యూ లైన్ లోకి ఉదయం టోకెన్లు లేకుండా ప్రవేశించిన భక్తులకు శ్రీవారి దర్శనం ఎనిమిది గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు. టైమ్ స్లాట్ దర్శనం భక్తులకు నాలుగు గంటల్లో దర్శనమవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం టిక్కెట్లను కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి ని 76,820 మంది భక్తులు దర్శించుకున్నారు. వీరిలో 24,368 మంది భక్తుుల తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 3.77 కోట్ల రూపాయలు వచ్చిందని అధికారులు వెల్లడించారు.