వారం క్రితం అదృశ్యమై.. వేరే వ్యక్తి ఇంట్లో కనిపించిన భార్య

దేవాస్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సూర్యకాంత్ శర్మ మాట్లాడుతూ, “మహిళ వారం క్రితం అదృశ్యమైంది.

Update: 2022-07-04 13:49 GMT

మధ్యప్రదేశ్‌లోని దేవాస్ జిల్లాలో ఓ గిరిజన మహిళను కొట్టడమే కాకుండా మెడలో చెప్పుల దండను కూడా వేశారు. అక్కడితో ఆగకుండా తన భర్తను భుజాలపై ఎక్కించుకుని బలవంతంగా మోయించారు. సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ కావడంతో ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది. కొంతమంది వ్యక్తులు ఆ మహిళను కొట్టడం కనిపించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహిళను భర్త గ్రామస్తుల ముందు దారుణంగా కొట్టాడు. తరువాత మహిళ తన భర్తను భుజాలపై మోయవలసి వచ్చింది. గ్రామస్తులు కూడా ఆమె మెడలో పాదరక్షల దండ వేశారని పోలీసులు తెలిపారు.

ఆ మహిళ కి వేరే వ్యక్తితో సంబంధముందని ఆరోపణలతో ఆమెకు ఈ శిక్ష విధించబడింది. మూడు నాలుగు రోజులుగా మహిళ కనిపించకుండా పోయిందని, ఆ తర్వాత ఆమె ఒక వ్యక్తి వద్ద దొరికిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె భర్త, గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా.. ఆ మహిళను శిక్షించాలని నిర్ణయించుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి బాధితురాలి భర్తతో సహా తొమ్మిది మందిని అరెస్టు చేశామని, దాడి చేయడం, అల్లర్లు చేయడం, మహిళ పట్ల విచక్షణ లేకుండా ప్రవర్తించడం, నేరపూరిత బెదిరింపులకు పాల్పడినందుకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు సోమవారం తెలిపారు. ఈ ఘటన ఆదివారం జరిగినప్పటికీ సోమవారం వెలుగులోకి వచ్చింది.
దేవాస్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ సూర్యకాంత్ శర్మ మాట్లాడుతూ, "మహిళ వారం క్రితం అదృశ్యమైంది. ఆమె భర్త తన భార్య కనిపించడం లేదని ఉదయ్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ మహిళ తన సన్నిహితుడిగా చెప్పుకునే వ్యక్తి ఇంట్లో నివసిస్తోందని అతనికి తెలిసింది. మహిళను భర్త గ్రామస్తుల ఎదుటే ఈడ్చుకెళ్లాడు. తరువాత, ఆమెను దారుణంగా కొట్టారు. " అని తెలిపారు. ఈ ఘటనపై మహిళ స్నేహితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు 15 ఏళ్ల వయసులో వివాహమైందని, భర్త వేధించేవాడని అందుకే పారిపోయానని మహిళ పోలీసులకు తెలిపింది.



Tags:    

Similar News