Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది

Update: 2026-03-13 04:02 GMT

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రవేటు బస్సు బోల్తా పడిన ఘటనలో నలుగురు మరణించారు. హైదరాబాద్ నుంచి మహారాష్ట్రకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగిందని సమాచారం. మహారాష్ట్రలోని అకోలాకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిజమాబాద్ జిల్లాలోని గన్నారం సమీపంలో జరిగిన ఈ ఘటనలో పలువురు ప్రయాణికులు గాయాలపాలయ్యారు.

22 మంది ప్రయాణికులతో...
తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం సమయంలో బస్సులో ఇరవై రెండు మంది ప్రయాణికులున్నారని, నలుగురు మరణించగా, గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించామని తెలిపారు. డ్రైవర్ వేగంతో వెళుతూ బస్సుపై నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News