Road Accident : రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు మరణించారు. హనుమకొండ జిల్లాలోని హాసన్ పర్తి మండలంలో ప్రమాదం జరిగింది. మృతులు ఎస్ ఆర్ కళాశాలకు చెందిన విద్యార్థులుగా గుర్తించారు. విద్యర్థులు ప్రయాణిస్తున్నబైక్ ను వెనకనుంచి టిప్పర్ ఢీకొట్టడంతో ఇద్దరువిద్యార్థులు అక్కడికక్కడే మరణించారు.
ఇద్దరు విద్యార్థులు...
మృతులను సుప్రతిక్,అక్రమ్ గాపోలీసులు గుర్తించారు.ఘటన జరిగిన వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి రతలించారు. టిప్పర్ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు.మృతులకుటుంబంలోవిషాదం నెలకొంది.