మహిళా ఎంపీ మార్నింగ్ వాక్.. చైన్ స్నాచర్ చేతివాటం

చైన్ స్నాచర్స్ కారణంగా మహిళలు రోడ్డు మీద నడుస్తూ వెళ్లాలంటేనే భయపడుతూ ఉంటారు.

Update: 2025-08-04 12:08 GMT

చైన్ స్నాచర్స్ కారణంగా మహిళలు రోడ్డు మీద నడుస్తూ వెళ్లాలంటేనే భయపడుతూ ఉంటారు. అయితే ఓ మహిళా ఎంపీకి కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. కాంగ్రెస్ నేత, పార్లమెంట్ సభ్యురాలు సుధా రామకృష్ణన్ ఢిల్లీలో మార్నింగ్ వాక్ చేస్తున్న సమయంలో ఆమె మెడలోని చైన్ కొట్టేశారు. తమిళనాడులోని మయిలాదుతురై పార్లమెంట్ నియోజకవర్గానికి సుధ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. డీఎంకే నాయకురాలు రజతితో కలిసి చాణక్యపురిలోని పోలండ్ ఎంబసీ సమీపంలో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ దొంగతనంపై ఆమె కేంద్ర హోంమంత్రి అమిత్ షా కు కూడా లేఖ రాశారు. ఉదయం 6.15-6.20 గంటల సమయంలో హెల్మెట్ పెట్టుకొని స్కూటీ మీద ఎదురుగా వచ్చిన ఒక వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కొని పారిపోయాడు. బలంగా గొలుసు లాగడంతో తన మెడమీద గాయాలయ్యాయని, డ్రెస్ కూడా కొద్దిమేర చినిగిందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Tags:    

Similar News