వలపు వల.. ఈ గ్యాంగ్ చేతిలో పడ్డారంటే మీ ఆస్తులు హాంఫట్

డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు. చీటింగ్ తో అనేక దారులు వెతుక్కుంటున్నారు

Update: 2026-01-21 06:27 GMT

డబ్బులు సంపాదించడానికి అనేక మార్గాలు. చీటింగ్ తో అనేక దారులు వెతుక్కుంటున్నారు. లక్షల రూపాయలు తక్కువ సమయంలో సంపాదించడమెలా? అని డాక్టరేట్ చేసి మరీ కొందరు మోసానికి పాల్పడుతున్నారు. అందులోనూ తియ్యటి గొంతుతో.. వయ్యారాలు వలకబోస్తూ అందమైన యువతి ఫోన్ లో మాట్లాడితే ఇక అంతకు మించి ఏముంటుంది. ఆ వాయిస్ కు పడిపోయి గ్రంధసాంగులు తమ వద్ద ఉన్నదంతా సమర్పించుకోవడానికి సిద్ధమవుతుంటారు. ఎంపిక చేసుకున్న వారిని వలలో వేసుకుని వారి నుంచి లక్షలు దండుకునే ముఠా ఒకటి తమిళనాడు పోలీసులు పట్టుకున్నారు. వీరి హిస్టరీ విని పోలీసులు అవాక్కయ్యారు. బెదిరింపులకు దిగడమే కాకుండా దాడులకు కూడా దిగుతున్నారు.

గ్యాంగ్ లో మొత్తం పన్నెండు మంది...
తమిళనాడులోని సేలం ప్రాంతానికిచెందిన అలమేలు తన స్నేహితులతో కలసి ఒక గ్యాంగ్ ను ఏర్పాటు చేసుకుంది. అలిమేలుతో పాటు ఆమె స్నేహితులైన జనార్థనన్, జన ఆంసప్రియన్ లతో కలసి ఒక ముఠాగా ఏర్పడి లక్షల రూపాయలు దోచుకుంది. సేలం పోలీసులు ఈ గ్యాంగ్ ను అదుపులోకి తీసుకున్నారు. సేలం పోలీసులు తెలిపిన కథనం ప్రకారం...ముందుగా తమ సమీప ప్రాంతంలోని డబ్బున్నవారిని జనార్థనన్, జన ఆంసప్రియన్ గుర్తిస్తారు. అందులో ప్రభుత్వోద్యుగులను కూడా ఎంపిక చేసుకుంటారు. వారి పూర్తి సమాచారంతో పాటు ఫోన్ నెంబర్లను సేకరించి అలిమేలుతో ఫోన్ చేయిస్తారు. తాను ఒంటరిగా ఉన్నానని, ఇంటికి రావాలంటూ అలిమేలు తియ్యని మాటలతో వలపు పిలుపు అందిస్తుంది.
వీడియోలు తీసి బెదిరించి...
అయితే ఒంటరిగా వచ్చిన వారిపై దాడి చేయడమే కాకుండా వీడియోలు కూడా తీసేవారు. తర్వాత వాటిని సామాజిక మాధ్యమాల్లో పెడతామని బెదిరించి అందిన కాడికి దండుకుంటారు. చివరకు సేలం జిల్లా ఒమలూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్సై గా ఉన్న భూపతి కూడా వీరి వలలో చిక్కుకున్నారు. డబ్బులు, బంగారాన్ని సమర్పించుకున్నాడు. అయితే భూపతి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సేలం పోలీసులు అలమేలుతో పాటు జనార్థనన్, జన ఆంసప్రియన్ లు కూడా అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ లో మొత్తం తొమ్మిది మంది సభ్యులున్నట్లు గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి సెల్ ఫోన్ లను సీజ్ చేశారు. కీలక ఆధారాలతో వారిపై కేసు నమోదు చేశారు. అలిమేలు బాధితులు ఒక్కొక్కరూ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు.
Tags:    

Similar News