Road Accident : దైవదర్శనానికి వెళుతూ ప్రమాదం.. ఐదుగురు మృతి

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2026-01-18 06:52 GMT

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. వేగంగా వెళుతున్న కారు అదుపుతప్పి చెట్టును ఢీకొట్టిడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మహారాష్ట్రలోని పూణే - షోలాపూర్ జాతీయ రహదారిపై ప్రమాదం జరిగింది.

కారు చెట్టును ఢీకొట్టడంతో...
రాయగడ జిల్లా పన్వెల్ నుంచి షోలాపూర్ జిల్లాలోని అక్మల్ కోటకు దైవ దర్శనం కోసం వెళుతూ ఈ పమ్రాదం జరిగింది. డ్రైవర్ నియంత్రణ కోల్పోయి చెట్టుకు ఢీకొట్టింది. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జుకాగా, అందులో ఉన్న వారిలో ఐదుగురు మరణించారు. మరొకరు గాయపడ్డారు. మృతులను తుకారం భండారే, విశాల్ నరేంద్ర భోసలే, అమర్ పాటిల్, ఆనంద్ మాలీలుగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News