Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు

Update: 2026-01-20 02:04 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మరణించారు. రాష్ట్రంలోని నిర్మల్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. అతి వేగంగా వస్తున్న కారు అదుపు తప్పి కంటైనర్ ను ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అతి వేగంగా వస్తున్న కారు కంటైనర్ ను ఢీకొట్టింది. భైంసా బస్ డిపో సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. నిర్మల్ జిల్లాకు చెందిన కుబేర్ మండలం కుప్టి గ్రామానికి చెందిన బాబన్న, భోజరాం పటేల్, రాజన్న, వికాస్ లతో పాటు మరో ఇద్దరు కారులో బయలుదేరి వస్తుండగా అదుపు తప్పింది.

అతి వేగం కారణంగానే...
ఈ ప్రమాదంలో ఈ నలుగురు మరణించగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.వారి ద్దరి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రమాదంతో ఆ మార్గంలో ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు వచ్చి ట్రాఫిక్ ను నియంత్రిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తుచేస్తున్నారు. అతి వేగంతో పాటు నిద్రమత్తులో డ్రైవ్ చేయడం ప్రమాదానికి కారణంగా పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆసుపత్రికి తరలించారు.


Tags:    

Similar News