టోల్ గేట్ డివైడర్‌కు తల తగిలి కాలేజీ విద్యార్థి మృతి
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం జరిగింది.
తూర్పు గోదావరి జిల్లాలో ఘోర విషాదం జరిగింది. ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ కాలేజీ విద్యార్థి కిటికీ నుంచి తల బయటకు పెట్టడంతో టోల్‌గేట్ వద్ద ఏర్పాటు చేసిన డివైడర్‌కు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు.ముమ్మిడివరం మండలం లక్ష్మీదేవిలంకకు చెందిన సోంపల్లి వెంకట రవీంద్ర అమలాపురంలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజూ ఆర్టీసీ బస్సులో అమలాపురం వెళ్లి వస్తుండేవాడు.
కాలేజీ వెళ్లేందుకు...
బుధవారం కాలేజీకి వెళ్లేందుకు బస్సులో ప్రయాణిస్తున్న సమయంలో అన్నంపల్లి టోల్‌గేట్ వద్ద రవీంద్ర కిటికీ నుంచి తల బయటకు పెట్టాడు. ఆ సమయంలో అక్కడ ఏర్పాటు చేసిన డివైడర్‌కు తల బలంగా తగలడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు.ఈ ఘటనపై ముమ్మిడివరం ఎస్సై డి. జ్వాలా సాగర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.