Road Accident : అంతా క్షణాల్లోనే...ఫిట్ నెస్ లేదు.. ఏమీ లేదు.. వోల్వో బస్సే కానీ.. అంతా బోగస్సే

హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్టంలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది.

Update: 2025-10-24 03:16 GMT

హైదరాబాద్ నుంచి బెంగళూరు మార్టంలో నిత్యం ప్రయాణికుల రద్దీ ఉంటుంది. వరసగా సెలవులు రావడంతో ఎక్కువ మంది ఈరోజు ఉదయం బెంగళూరుకు చేరుకునేందుకు బయలుదేరారు. కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యంతో పాటు బస్సు యాజమాన్యం కూడా కారణమని చెబుతున్నార. బెంగళూరులో హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు కావచ్చు.. వారి బంధువులు కావచ్చు. హైదరాబాద్ - బెంగళూరు మధ్య ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు అనేక రైళ్లున్నాయి. వందేభారత్ రైలు కూడా ఉంది. అయితే ఇందులో టిక్కెట్లు దొరకడం ఎప్పుడూ కష్టమే. ఇక టీజీ ఆర్టీసీ తో పాటు కేఎస్ ఆర్టీసీ కూడా తమ బస్సులను హైదరాబాద్ - బెంగళూరుకు నిత్యం పదుల సంఖ్యలో బస్సులను నడుపుతుంది.

వోల్వోబస్సు సుఖమని...
కానీ ప్రయాణికులు వోల్వో బస్సులో ప్రయాణం సుఖవంతమని భావించి సురక్షిత ప్రయాణాన్ని మరిచి ప్రయివేటు ట్రావెల్స్ బస్సును ఆశ్రయిస్తారు. హైదరాబాద్ - బెంగళూరు మార్గంలో ఎక్కువగా ప్రయివేటు బస్సులు వందల సంఖ్యలో తిరుగుతుంటాయి. అయితే ప్రయివేటు బస్సు యాజమాన్యం డబ్బు సంపాదన పై ఉండే ఆసక్తి దాని నిర్వహణ విషయంలో మాత్రం చూపరు. అదే ప్రభుత్వ సంస్థ ఆధ్వర్యంలో నడిచే బస్సులకు నిరంతరం తనిఖీలుంటాయి. ఇద్దరు డ్రైవర్లున్నప్పటికీ బస్సు కండిషన్ సరిగా లేకపోవడం వల్లనే కర్నూలులో జరిగిన బస్సు ప్రమాదం మరొకసారి రుజువు చేసింది. ప్రమాదానికి గురైన బస్సుకు ఫిట్ నెస్ సర్టిఫికేట్ కూడా లేదని అంటున్నారు.
వేమూరి కావేరి ట్రావెల్స్ కు చెందిన...
వేమూరి కావేరీ ట్రావెల్స్ కు చెందిన బస్సు కావడంతో హైదరాబాద్ లోని వారి కార్యాలయాన్ని సిబ్బంది మూసి వేశారు. నిన్న రాత్రి 9.40 గంటలకు మూసాపేట నుంచి ప్రమాదానికి గురైన కావేరీ ట్రావెల్స్ బస్సు బయలుదేరింది. మార్చి 31 వ తేదీ వరకూ ఫిట్ నెస్ వాలిడిటీ ఉన్నట్లు చెబుతున్నారు. ఇన్సూరెన్స్ సమయం కూడా ముగిసిపోయిందంటున్నారు. జాతీయ రహదారిపై ఈ ప్రమాదం జరగడంతో అటు వైపు వెళుతున్న వారు సహాయక చర్యలు చేపట్టడంతో పాటు మంటలు అంటుకోగానే ఎమెర్జెన్సీ డోర్ ను, బస్సు అద్దాలను పగులకొట్టుకుని కొందరు మాత్రం ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడగలిగారు. ప్రమాదం జరిగిన తర్వాత బస్సు డోర్ లాక్ కావడంతో కిటికీలు పగులకొట్టి బయటపడ్డారు. అంతా క్షణాల్లో జరిగిపోవడంతో ప్రయాణికులు సీట్లోనే ప్రాణాలు వదిలారు.


Tags:    

Similar News