Breaking : హైదరాబాద్ పేలుళ్ల కేసు : 11 మందికి పదేళ్ల జైలు శిక్ష

హైదరాబాద్ పేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. పదకొండు మంది నిందితులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.

Update: 2023-10-26 14:53 GMT

హైదరాబాద్ పేలుళ్ల కేసులో తీర్పు వెలువడింది. పదకొండు మంది నిందితులకు పదేళ్లు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఢిల్లీ ఎన్ఐఏ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కీలక సూత్రధారి ఒబెర్ ఉర్ రెహమాన్ తో పాటు మరో పది మందికి ఈ జైలు శిక్ష విధించింది. పాకిస్థాన్ నుంచి పేలుడు పదార్థాలు తెచ్చి ఇక్కడ పేలుళ్లు సంభవించేలా చేయాలని ప్లాన్ చేశారు. 2012 లో హైదరాబాద్ లో పేలుళ్లు జరపాలని కుట్ర చేశారు.

పాక్ నుంచి పేలుడు పదార్ధాలు తెచ్చి...

అయితే ముందుగా పసిగట్టిన తెలంగాణ పోలీసులు వీరి కుట్రను భగ్నం చేశారు. పదకొండు మందికి పదేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తూ ఎన్ఐఏ కోర్టు తీర్పు చెప్పడంతో తెలంగాణ పోలీసులపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన నిందితులు జైలులో రిమాండ్ ఖైదీలుగా ఉన్నారు. ప్రస్తుతం ఈ కేసు తీర్పు రావడంతో హైదరాబాద్ పై కుట్రకు పాల్పడ్డవారికి తగిన శిక్ష పడిందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.


Tags:    

Similar News