బ్యాంక్ ఆఫ్ బరోడా కేసు : కోర్టులో లొంగిపోయిన నిందితుడు ప్రవీణ్

వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. క్యాషియర్ ప్రవీణే నగదు తీసుకుని ఉడాయించి ఉంటాడని, అతనిపై కేసు నమోదు చేశారు.

Update: 2022-05-16 09:51 GMT

వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా దొంగతనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బ్యాంకు నుంచి రూ.22 లక్షల 53 వేలతో ఉడాయించినట్లు భావిస్తోన్న నిందితుడు ప్రవీణ్ నేడు కోర్టులో లొంగిపోయాడు. వనస్థలిపురం బ్యాంక్ ఆఫ్ బరోడా లో క్యాషియర్ గా పనిచేస్తున్న ప్రవీణ్.. మే 10వ తేదీ మంగళవారం సాయంత్రం తనకు ఆరోగ్యం బాలేదని ఇప్పుడే బయటికి వెళ్లొస్తానని.. బ్యాంక్ క్లోజింగ్ టైం కన్నా ముందే వెళ్లిపోయాడు. ఎంతసేపటికి ప్రవీణ్ తిరిగి రాకపోవడంతో.. బ్యాంక్ మేనేజర్ క్యాష్ బాక్స్ ను చెక్ చేయగా.. అందులో రూ.22.53 లక్షలు మిస్సైనట్లు గుర్తించారు.

వెంటనే పోలీసులకు సమాచారమివ్వగా.. క్యాషియర్ ప్రవీణే నగదు తీసుకుని ఉడాయించి ఉంటాడని, అతనిపై కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కోసం పోలీసులు వారంరోజులుగా వెతుకుతున్నా ఆచూకీ దొరకలేదు. పైగా.. బ్యాంక్ లో పోయిన నగదుకు తనకు ఎలాంటి సంబంధం లేదని, తనను కావాలనే ఈ కేసులు ఇరికించడానికి ట్రై చేస్తున్నారని ఆరోపిస్తూ వీడియోలు పంపాడు. తాను హైదరాబాద్ లో లేనని, వారణాసిలో ఉన్నానని ప్రవీణ్ నమ్మించే ప్రయత్నం చేశాడు. కానీ.. ప్రవీణ్ ఇటీవల చేసిన ఇన్ స్టా చాటింగ్ ఆధారంగా అతను గోవాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులు తనను అరెస్ట్ చేయడానికి ముందే.. ప్రవీణ్ స్వతహాగా కోర్టులో లొంగిపోవడంతో.. న్యాయస్థానం అతడిని రిమాండ్ కు పంపింది.







Tags:    

Similar News