హెల్మెట్స్ లేవని ఆపినందుకు.. పోలీసుని యూపీ యువకులు ఏమి చేశారంటే..!

Update: 2022-10-28 01:15 GMT

హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు యువకులను ఆపారు పోలీసులు. అయితే ఆ యువకులు ఒక్కసారిగా రెచ్చిపోయారు.. ఉత్తరప్రదేశ్ పోలీస్ హెడ్ కానిస్టేబుల్‌ను నలుగురు వ్యక్తులు నడి రోడ్డుపై కొట్టారు. ఈ విషయాన్ని అధికారులు కూడా ధృవీకరించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. నలుగురు యువకులు నడిరోడ్డుపై పోలీసు అధికారిని తిట్టడం.. ఆ తర్వాత గుంపుగా చేరి అతడిని కొట్టడం మనం వీడియోలో చూడవచ్చు. వారి దెబ్బలకు తాళలేక పోలీసు అధికారి దూరంగా వెళ్ళిపోయాడు.

ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు, దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. వీడియోలో, నలుగురు వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్‌ను కొట్టడం, దుర్భాషలాడడం కనిపిస్తుంది. "పారా పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీకాంత్.. హెల్మెట్ లేకుండా మోటార్‌సైకిల్‌పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులను అడ్డుకున్నారు. ఆ వ్యక్తులు హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేశారు" అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రాహుల్ రాజ్ తెలిపారు. పారా పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితులను గుర్తించామని.. వారిని అరెస్టు చేయడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయని పోలీసు అధికారులు తెలిపారు.



Tags:    

Similar News