యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై కాల్పులు

ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు

Update: 2025-08-17 04:11 GMT

ప్రముఖ యూట్యూబర్ ఎల్విష్ యాదవ్ ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈరోజు తెల్లవారు జామున ఐదున్నర గంటల ప్రాంతంలో గురుగ్రామ్ లోని ఎల్విష్ యాదవ్ ఇంటి వద్దకు ముగ్గురు గుర్తు తెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కాల్పులు జరిపారు. అక్కడే ఉన్న వారు కాసేపు నిల్చుని తర్వాత వెళ్లిపోయారు.

పన్నెండు రౌండ్లు...
ఎల్విష్ యాదవ్ ఇంటిపై దుండగులు పన్నెండు రౌండ్లు కాల్పులు జరిపినట్లు పోలీసులు చెబుతున్నారు. ఎల్విష్ యాదవ్ బిగ్ బాస్ హిందీ ఓటీటీ సీజన్ 2 విజేతగా నిలిచారు. అయితే కాల్పులకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారయిన దుండగుల కోసం పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి.


Tags:    

Similar News