పలాసలో రెండు బస్సులు ఢీ.. ఒకరి మృతి.. ఇరవై మందికి గాయాలు
శ్రీకాకుళం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగడా ఇరవై మందికి గాయాలయ్యాయి
road accident in anantapur
శ్రీకాకుళం జిల్లాలో రెండు బస్సులు ఢీకొన్న ఘటనలో ఒకరు మరణించగడా ఇరవై మందికి గాయాలయ్యాయి. సంక్రాంతి పండగ రోజు ఈ విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్ నుంచి రామేశ్శరం వెళుతున్న బస్సు శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద మరో బస్సు ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ప్రయాణికులందరూ భయపడి ఆందోళనకు గురయ్యారు.
పొగ మంచుకారణంగానే...
అయితే ఈ ప్రమాదంలో ఇరవై మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని పలాస ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతి చెందింది ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. పొగమంచు కారణంగానే రోడ్డు ప్రమాదం జరిగిందని పోలీసులు ప్రాధమికంగా భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం పలాస ఆసుపత్రికి తరలించారు.