ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం.. పది మంది మృతి

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒ

Update: 2026-03-16 02:51 GMT

ఒడిశాలో ఘోర ప్రమాదం జరిగింది. ఒడిశా రాష్ట్రంలోని కటక్‌ ఎస్‌సీబీ మెడికల్‌ కాలేజ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. ఈ ప్రమాదంలో పదకొండు మంది గాయపడ్డారు. ఘటనాస్థలిలో సహాయక చర్యలు వెంటనే చేపట్టారు. ఆ రాష్ట్ర సీఎం ఆస్పత్రికి వెళ్లి పరిస్థితిని సమీక్షించారు.ఆసుపత్రి ఎమెర్జెన్సీ వార్డులోని ట్రామా కేర్ ఐసీయూలో ఈ మంటలు తొలుత ప్రారంభించాయి.

షార్ట్ సర్క్యూట్ కారణంగానే...
షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. ఐసీయూలో చికిత్స పొందుతున్న పది మంది రోగులు ఈ ప్రమాదంలో మరణించారు. సహాయక చర్యల్లో పాల్గొన్న ఆసుపత్రి సిబ్బంది కూడా అస్వస్థతకు గురయ్యారు. మృతుల కుటుంబాకు ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ ఒక్కొక్కరికి ఇరవై ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని ఇతర ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News