Murder Case : ఆటతో అత్తను చంపిన కోడలు
పెందుర్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తను హత్య చేసేందుకు కోడలు మాస్టర్ ప్లాన్ వేసింది
పెందుర్తి అనుమానాస్పద మృతి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది. అత్తను హత్య చేసేందుకు కోడలు మాస్టర్ ప్లాన్ వేసింది. దాగుడు మూతలు ఆడుదామంటూ అత్త కళ్లకు గంతలు కట్టి, తాళ్లతో బంధించి తర్వాత కోడలు నిప్పంటించిన ఘటన విశాఖ జిల్లలో జరిగింది. అయితే అగ్ని ప్రమాదం జరిగినట్లు నమ్మించే ప్రయత్నం చేసి వికటించింది.
తాళ్లతో బంధించి...
చివరకు పోలీసుల విచారణలో అసలు విషయం బయటపడింది. అత్తమీద కోపంతోనే ఆట పేరుతో తాళ్లతో బంధించి కోడలు హత్య చేసిందని పోలీసులు గుర్తించారు. తాళ్లతో కట్టిన తర్వాత పెట్రోల్ పోసి దీపం విసిరి కోడలు నిప్పంటించిందని పోలీసుల విచారణలో వెల్లడంయింది. అయితే పోలీసులు కోడలిని అరెస్ట్ చేసి విచారించగా అసలు విషయం బయటపడింది. అత్తను కోడలు హతమార్చినట్లు నిర్థారించిన పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.