ఘోర రైలు ప్రమాదం... పది మంది మృతి
చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది వరకూ మరణించారు.
చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ వద్ద ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది వరకూ మరణించారు. జైరామ్ నగర్ స్టేషన్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్యాసింజర్ రైలుగూడ్స్ రైలుపే ఢీకొట్టడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. కోర్బా పాస్యిసంజర్ రైలు గూడ్స్ రైలుపే ఢీకొట్టడంతో ఈ ప్రమాదంలో పది మంది మరణించనిట్లు తెలిసింది. ఘటన స్థలిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
పాసింజర్ రైలును...
రైలు సిగ్నలింగ్ వ్యవస్థ సక్రమంగా పనిచేయకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది. బిలాస్ పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో అనేక మంది గాయపడ్డారు. మృతులు సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించేందుకు చేర్పించారు. సహాయక చర్యలు ముమ్మరంగా జరుగుతున్నాయి. రైల్వే పోలీసులతో పాటు ఇతర సిబ్బంది సహాయక చర్యలలో పాల్గొంటున్నారు. రైలు ఢీకొట్టడంతో కొన్ని బోగీలు పట్టాలు తప్పాయి. దీంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.