ఏం కష్టమొచ్చిందో.. ఒకే కటుంబంలోని ఏడుగురు బలవన్మరణం..కారులోనే ప్రాణాలొదిలి
హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారులో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు
హర్యానాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కారులో ఏడుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఆత్మహత్యకు పాల్పడ్డారు. హర్యానాలోని పంచకులలో ఈ ఘటన జరిగింది. మృతులను డెహ్రాడూన్ వాసి ప్రవీణ్ మిట్టల్ గా గుర్తించారు. వ్యాపారిగా ఉన్న ప్రవీణ్ మిట్టల్ అతని భారయతో పాటు ముగ్గురు పిల్లు కూడా మరణించారు. కారులోనే విషం తీసుకుని మరణించారు. ఆధ్యాత్మిక కార్యక్రమం వద్దకు వచ్చిన ఆ కుటుంబం కారులోనే ఉండటంతో కొందరు స్థానికలకు అనుమానం వచ్చి చూడటంతో కారులో విగతజీవులుగా కనిపించారు.
ఆర్థిక ఇబ్బందులేనా?
ఇక్కడ కారు నిలపవద్దని చెప్పినా హోటల్ లో రూమ్ లభించలేదని, అందుకే ఇక్కడ కారులోనే విశ్రాంతి తీసుకుంటున్నామని చెప్పారు. ఆరుగురు కుటుంబ సభ్యులు కారులోనే ప్రాణాలు వదలగా, ప్రవీణ్ మాత్రం ఆసుపత్రిలో చికిత్స పొందుత మరణించారు. ప్రవీణ్ మిట్టల్ తో పాటు ఆయన భార్య, ముగ్గురు పిల్లలు, తల్లిండ్రులు కూడా ఈ ఘటనలో మరణించారు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్లనే మరణించి ఉండవచ్చని పోలీసులు ప్రాధమికంగా భావించారు. పోలీసులు మృతదేహాలను ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం చేయిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.