నాగాయలంక వద్ద గల్లంతయిన మత్స్యకారులు

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జారి పడ్డారు. ఇద్దరు గల్లంతయ్యారు.

Update: 2025-06-16 07:10 GMT

కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులు జారి పడ్డారు. ఇద్దరు గల్లంతయ్యారు. అంతర్వేది సాగర సంగమం వద్ద బోటులో నుంచి జారిపడిన మత్స్యకారులు కనిపించకుండా పోయారు. జారిపడిన మత్స్యకారుల్లో ఇద్దరు గల్లంతు కాగా ఒకరి మృతదేహం లభ్యమయిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. పోలీసులు అక్కడకు చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు.

చేపల వేటకు వచ్చి...
కృష్ణా జిల్లా నాగాయలంక నుంచి చేపల వేటకు వచ్చిన మత్స్యకారుల బోటులో ఉన్న మత్స్యకారులు అంతర్వేది తీరానికి చేరుకుంటున్న సమయంలో ప్రమాదం జరిగిందని, బోటులో నుంచి ఇద్దరు మత్స్యకారుల జారిపడి గల్లంతు అయ్యారు. మరో మత్స్యకారుడు కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. గజ ఈతగాళ్లు గాలిస్తున్నారు.


Tags:    

Similar News