కామారెడ్డి జిల్లాలో విషాదం
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు
కామారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. ఈతకు వెళ్లిన ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సోమార్ పేట వద్ద నిజాంసాగర్ బ్యాక్ వాటర్ లో ఈతకు వెళ్లిన ముగ్గురు కనిపించకుండా పోయారు. స్నేహితులో కలసి ఎల్లారెడ్డికి చెందిన ముగ్గురు యువకులు ఈతకు వెళ్లి గల్లంతయ్యారు. గల్లంతయిన వారిని హర్షవర్ధన్, నవీన్, మధుకర్ గౌడ్ గా గుర్తించారు.
ఈతకు వెళ్లి ముగ్గురు గల్లంతు...
అయితే యువకులు గల్లంతయిన సమాచారం అందుకున్న పోలీసులు గజఈతగాళ్లను రప్పించి వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. మూడు కుటుంబాల్లో విషాదం అలుముకుంది. ఈత రాకపోయినా బ్యాక్ వాటర్ లోకి దిగి గల్లంతయిన వారి కోసం పోలీసులు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారుు.