Andhra Pradesh : గణేశ్ శోభాయాత్రలో విషాదం.. ఆరుగురి మృతి

వినాయకనిమజ్జన ఉత్సవంలో విషాదం నెలకొంది. శోభాయాత్రలో మొత్తం ఆరుగురు మరణించారు

Update: 2025-09-01 02:44 GMT

పశ్చిమ గోదావరి జిల్లా వినాయకనిమజ్జన ఉత్సవంలో విషాదం నెలకొంది. శోభాయాత్రలో మొత్తం ఆరుగురు మరణించారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లు గ్రామంలో నిన్న రాత్రి వినాయక నిమజ్జనం నిర్వహించారు. యాత్ర వెళుతుండగా ట్రాక్టర్ డ్రైవర్ రెండు నిమిషాల పాటు విశ్రాంతి తీసుకునేందుకు కిందకు దిగాడు. దీంతో ఒక యువకుడు ట్రాక్టర్ నడిపేందుకు ప్రయత్నించగా అదుపుతప్పి అది భక్తులపైకి వెళ్లింది. దీంతో నరసింహమూర్తి, గురుజు మురళి, కడియం దినేశ్, ఈమన సూర్యనారాయణలు మరణించారు.

గాయపడిన వారిని...
పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు మండలం చింతలవీధిలో వినాయక నిమజ్జనం జరుగుతున్న సందర్భంగా ఒక వాహనం దూసుకు రావడంతో అక్కడ ఉన్న కొర్రా సీతారామ్, గుండ కొండబాబు అక్కడిక్కడే మరణించారు. మరికొందరికి గాయాలయ్యాయి. రెండు జిల్లాల్లో వినాయక నిమజ్జనం సందర్భంగా ఆరుగురు మరణించారు. రెండు చోట్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News