Leopard Attack : చిన్నారిని నోటకరుచుకుని లాక్కుని వెళ్లిన చిరుత
తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిని చిరుతపులి లాక్కుని వెళ్లింది. దాడి చేసి చంపేసింది
తమిళనాడులో ఘోర విషాదం నెలకొంది. ఇంటి ఎదుట ఆడుకుంటున్న చిన్నారిని చిరుతపులి లాక్కుని వెళ్లింది. దాడి చేసి చంపేసింది. ఈ ఘటన కోయంబత్తూర్ కు సమీపంలోని వాల్పరైలోని టీ ఎస్టేట్ లో జరిగింది. తల్లిదండ్రులు టీ ఎస్టేట్ లో పనిచేస్తుండగా ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని నోటకరుచుకుని వెళ్లింది. బాలిక అరుపులు విన్న తర్వాత తల్లిదండ్రులు తోటి వారంతా కలసి వెదికినా కనిపించలేదు. అయితే కొన్ని గంటల తర్వాత అటవీ ప్రాంతంలో చిరుత పులి దాడి చేసి పడేసిన బాలిక శరీరభాగాలను గుర్తించారు.
గాలింపు చర్యలు చేపట్టి...
పోలీసులు, అటవీ శాఖ అధికారులు వచ్చేసరికి అప్పటికే పరిస్థితి చేయి దాటి పోయింది. ఈ ప్రాంతంలోనే చిరుతపులి సంచరిస్తుందని భావించిన అటవీ శాఖ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఒంటరిగా చిన్నారులు, వృద్ధులు కానీ ఇంటి బయట ఉండవద్దని, అలాగే టీ ఎస్టేట్ లో పనిచేసే వారు కూడా గుంపులుగా వెళ్లాలని, ఒంటరిగా వెళ్లవద్దని అటవీ శాఖ అధికారులు సూచించారు. ఆ ప్రాంతంలో కెమెరాలను ఏర్పాటు చేసి చిరుతపులిని గుర్తించేందుకు చర్యలు తీసకుంటున్నారు. జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.