పండగపూట విషాదం.. 9 మంది విద్యార్థులు మృతి

కేరళలో విషాదం చోటు చేసుకుంది. పండగ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మరణించారు

Update: 2022-10-06 03:25 GMT

కేరళలో విషాదం చోటు చేసుకుంది. పండగ రోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మరణించారు. 36 మంది వరకూ గాయాలపాలయ్యారు. వీరిలో 12 మంది పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. పాలక్కడ్ జిల్లా వడక్కంచేరి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. విద్యార్థులతో వెళుతున్న బస్సు కేరళ ఆర్టీసీ బస్సును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఎర్నాకులం జిల్లాల మూలంతురుతిలోని పాఠశాలకు చెందిన విద్యార్థులు ఊటికీ విహారయాత్రకు వెళ్లారు.

ఊటీకి వెళ్లి....
బస్సులో 42 మంది విద్యార్థులతో పాటు ఐదుగురు టీచర్లు కలసి ఊటీకి ప్రయివేటు బస్సులో వెళ్లారు. అయితే గురువారం అర్థరాత్రి విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు వడక్కం చేరి వద్ద కేరళ ఆర్టీసీ బస్సును వెనక నుంచి ఢీకొట్టింది. విద్యార్థులు ప్రయాణిస్తున్న బస్సు అదుపుతప్పి కాల్వలోకి పడింది. ఆర్టీసీ బస్సులో 49 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదంలో ఒకరు మరణించారు. కేరళ ఆర్టీసీ బస్సు కొట్టరక్కర నుంచి కోయంబత్తూరు వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మృతుల్లో విద్యార్థులతో పాటు ఒక టీచర్ కూడా ఉన్నారని తెలిసింది. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News