ఎక్కడున్నా దాక్కున్నా పట్టుకుంటామన్న పోలీసులు... వదిలేదే లేదంటున్న బాధితులు

కేరళలోని ఆలప్పుజా కుచెందిన టోమీ ఎ. వర్గీస్ షినీ టోమీల జంట బెంగళూరుకు వచ్చి A&A చిట్స్ అండ్ ఫైనాస్స్ సంస్థను ఏర్పాటు చేసింది.

Update: 2025-07-11 05:44 GMT

నమ్మకం అనేది నేడు పెట్టుబడి. ఆశను ఎరగా వేసి అమాయకులను లూటీ చేసిన వారిని అనేక మందిని చూశాం. కానీ ఈ జంట దందాగిరీ వేరు. ప్రజల నుంచి సేకరించిన డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపేందుకు పక్కా ప్లాన్ వేశారు. పారిపోయిన తర్వాత ఎక్కడ ఉండాలో కూడా ముందుగానే ప్లాన్ చేసుకుని అందుకు తగినట్లుగా అన్నీ ఏర్పాటు చేసుకున్న తర్వాత వన్ ఫైన్ మార్నింగ్ బిచాణా ఎత్తేశారు. బెంగళూరులో ఒక చిట్ ఫండ్ బారినపడి వందలామది బాధితులు ఇబ్బందులు పడుతున్నానరు. కేరళకు చెందిన ఒక జంట బెంగళూరుకు వచ్చి A&A చిట్స్ అండ్ ఫైనాస్స్ సంస్థను ఏర్పాటు చేసింది.

కేరళకు చెందిన...
కేరళలోని ఆలప్పుజా కుచెందిన టోమీ ఎ. వర్గీస్ షినీ టోమీలు భార్యాభర్తలు. సులువుగా డబ్బులు సంపాదించాలనుకున్నారు. కానీ సొంతరాష్ట్రమయితే ఇబ్బదులుంటాయని భావించి పొరుగు రాష్ట్రమైన బెంగళూరుకువచ్చి స్థిరపడ్డారు. అక్కడ A&A చిట్స్ అండ్ ఫైనాస్స్ సంస్థను ఏర్పాటు చేసి పదిహేను నుంచి ఇరవై శాతం లాభాలు వస్తాయని, పెట్టుబడులు పెట్టాలని ప్రజలను కోరింది. దీంతో దాదాపు నాలుగు వందల మంది వరకూ ఈ చిట్ ఫండ్ సంస్థలో పెట్టుబడి పెట్టారు. అంటే దాదాపు నలభై కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు.
ఇరవై ఐదేళ్లుగా...
గత ఇరవై ఐదేళ్ల నుంచి బెంగళూరులో నమ్మకంగా ఉంటున్న ఈ జంట పెట్టుబడి దారుల నుంచి సేకరించిన నలభై కోట్ల రూపాయలతో పరారయ్యారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల దర్యాప్తులో ఈ నెల 3వ తేదీన వారు టూరిస్ట్ వీసాతో కెన్యాకు పారిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది. వారి బ్యాంకు ఖాతాలను, ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. తొలి నాళ్లలో చెల్లింపులు బాగా చేసి రాను రాను ఆలస్యం చేస్తూ చివరకు జంట మాయమైంది.ఒకవైపు ఐపీఎల్ ఛాంపియన్ గా గెలిచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో విజయోత్సవాలు నిర్వహించే సమయంలో జంట జెండా పీకేసింది. అయితే కెన్యాకు కాదు కదా? ఎక్కడకు వెళ్లినా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు. వారి కోసం గాలిస్తున్నారు. కెన్యా నుంచి ఇక్కడకు తీసుకు వచ్చే ప్రయత్నాలను పోలీసు శాఖ చేస్తున్నట్లు సమాచారం.


Tags:    

Similar News