Manipur : మణిపూర్‌లో మరోసారి హింస.. ముగ్గురి మృతి
మణిపూర్ లోని దౌబాల్ జిల్లాలో కొందరు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు
Three people were killed in firing by some people in Manipur.
మణిపూర్ లో ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి. గత కొద్ది నెలలుగా మణిపూర్ రాష్ట్రంలో టెన్షన్ నెలకొని ఉంది. తాజాగా మణిపూర్ లోని దౌబాల్ జిల్లాలో కొందరు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించారు. ఈ కాల్పుల ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడినట్లు తెలిసింది. లిలాంగ్ చింగ్లీవ్ ప్రాంతానికి పోలీసు దుస్తుల్లో వచ్చిన కొందరు దుండగులు ఈ కాల్పులు జరిపినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.
ఎందుకోసమో?
అయితే వీరు డబ్బుల కోసమే వచ్చారని కొందరు చెబుతున్నారు. గాయపడిన వారిని వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. అయితే కారులో వచ్చి కాల్పులు జరిపిన దుండగుల కోసం భద్రతాదళాలు వెతుకులాట ప్రారంభించాయి. ఈ ఘటనతో మరోసారి మణిపూర్‌లో ఉద్రిక్తత తలెత్తింది. ముఖ్యమైన ప్రాంతాల్లో బలగాలను మొహరించి ప్రభుత్వం పరిస్థితులను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది.