ఏపీలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి

ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ సహాయంతో విద్యుత్ లైను పునర్ధరించడానికి ప్రయత్నిస్తుండగా..

Update: 2023-06-29 11:55 GMT

ఆంధ్రప్రదేశ్ లో వేర్వేరు ప్రాంతాల్లో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఒక రైతు, ఎలక్ట్రీషియన్, ఓ యువకుడు ఉన్నారు. నెల్లూరు జిల్లా కలిగిరి మండలంలోని కుమ్మర కొండూరు పొలాల్లో 11 కేవీ వైరు తగలడంతో ఇద్దరు మృతి చెందిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు మృతుడు కంచంరెడ్డి మల్లికార్జున రెడ్డి గోరుచిక్కుడు పంట వేశాడు. రెండ్రోజుల క్రితం ఈదురుగాలులకు తోటలోకి విద్యుత్ సరఫరా అయ్యే వైరు తెగిపోయింది.

ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ వేల్పుల నారాయణ సహాయంతో విద్యుత్ లైను పునర్ధరించడానికి ప్రయత్నిస్తుండగా.. ఎల్ టీ లైన్ పై ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి ఇద్దరూ షాక్ కు గురయ్యారు. ఈ ప్రమాదంలో.. మల్లిఖార్జున రెడ్డి(43), నారాయణ(40) లు పూర్తిగా కాలిపోయారు. నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగి ఇద్దరూ మరణించారని గ్రామస్తులు చెబుతున్నారు. మల్లిఖార్జున రెడ్డికి ముగ్గురు పిల్లలు, నారాయణకు ఇద్దరు పిల్లలు, భార్య ఉన్నారు.
కృష్ణాజిల్లా గుడివాడ రూరల్ మండలంలోని బిల్లపాడులో మరో యువకుడు విద్యుత్ షాక్ కు గురై ప్రాణాలు కోల్పోయాడు. వేముల మురళి(17) జగనన్న కాలనీలోని ఓ ఇంటి పై అంతస్తులో పని చేస్తున్నాడు. ఇంటిపై నుంచి వేసిన విద్యుత్ వైర్లు తగలడంతో.. మురళి షాక్ కు గురై భవనం పై నుంచి కిందపడి మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







Tags:    

Similar News