Breaking : మాజీ మంత్రి పొన్నాల ఇంట్లో భారీ చోరీ

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యఇంట్లో భారీ చోరీ జరిగింది.

Update: 2025-01-17 03:42 GMT

మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్యఇంట్లో భారీ చోరీ జరిగింది. ఈ మేరకు పొన్నాల లక్ష్మయ్య కుటుంబీకులు ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ లో ఉన్న మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య నివాసంలో నిన్న రాత్రి ఈ భారీ చోరీ జరిగినట్లు తెలిసింది. దొంగలు లక్షన్నర నగదుతో పాటు విలువైన బంగారు ఆభరణాలను కూడా తీసుకెళ్లారని తెలిసింది.

నగదు, బంగారు ఆభరణాలను...
ఫిర్యాదు తీసుకున్న పోలీసులు పొన్నాల లక్ష్మయ్య ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించారు. నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పొన్నాల లక్ష్మయ్య ఇంట్లో చోరీ జరిగిన విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News