ఆ ఎమ్మెల్యే దొంగలకు సాఫ్ట్ టార్గెట్

ఓ ఎమ్మెల్యేని దొంగలు టార్గెట్ చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఆయన వస్తువులను చోరీ చేశారు.

Update: 2025-07-09 09:30 GMT

రాజస్థాన్ 

ఓ ఎమ్మెల్యేని దొంగలు టార్గెట్ చేశారు. నెల రోజుల వ్యవధిలో మూడుసార్లు ఆయన వస్తువులను చోరీ చేశారు. రాజస్థాన్‌ కు చెందిన దీన్‌ దయాల్ బైర్వా దౌసా నిజయోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కొద్దిరోజులుగా వరుసగా ఆయన వస్తువులు చోరీకి గురవుతున్నాయి. జూన్ 11న దౌసాలో మాజీ కేంద్ర మంత్రి రాజేశ్ పైలట్ వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఫోన్ పోయింది. తర్వాత కొన్ని రోజులకు ఆయన ఇంటి దగ్గర మోటార్‌సైకిల్ దొంగతనానికి గురైంది. తాజాగా ఆయన ఇంటి దగ్గర ట్రాక్టర్ ట్రాలీ చోరీ అయింది. వరుసగా ఆయన వస్తువులనే టార్గెట్ చేశారు దొంగలు.

Tags:    

Similar News