Encounter : జమ్మూ కశ్మీర్‌లో ఎన్ కౌంటర్

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ లో ఒక ఉగ్రవాది మరణించాడు

Update: 2025-09-08 04:30 GMT

జమ్మూ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో సోమవారం ఉగ్రవాదులు మరియు భద్రతా బలగాల మధ్య ఎన్‌కౌంటర్ చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు.గుదార్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారం మేరకు భద్రతా బలగాలు గాలింపు చర్యలు ప్రారంభించాయి. ఈ సందర్భంగా ఎదురు కాల్పులు జరిగాయి.

ఎదురు కాల్పుల్లో...
గాలింపు చర్యలు కొనసాగుతుున్న సమయంలో ఉగ్రవాదులు భద్రతా బలగాలపై కాల్పులు జరపడంతో అది ఎన్‌కౌంటర్‌గా మారిందని అధికారులు వెల్లడించారు.ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో భద్రతాదళాలు గాలింపు చర్యలు చేపట్టగా ఒక ఉగ్రవాది కాల్పులు జరపడంతో అతనిని భద్రతాదళాలు మట్టుపెట్టాయి.


Tags:    

Similar News