Breaking : ధర్మవరంలో ఉగ్ర కదలికలు
శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపాయి. ధర్మవరంలో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వారిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
శ్రీ సత్యసాయి జిల్లాలో ఉగ్రవాద కదలికలు కలకలం రేపాయి. ధర్మవరంలో ఉగ్రవాదులకు ఊతమిస్తున్న వారిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. నూర్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించేందుకు సిద్ధమవుతున్నారు. ధర్మవరం పట్టణంలోకి కోట కాలనీలో ఉంటున్న వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో స్థానిక పోలీసులతో పాటు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు.
పదహారు సిమ్ కార్డులు...
అయితే అదుపులోకి తీసుకున్న వ్యక్తి ఉగ్రవాదులకు ఎలా సహకరించారన్న కోణంలో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు విచారణ చేపట్టనున్నారు. అదుపులోకి తీసుకున్నారు కానీ పూర్తి స్థాయిలో విచారణ చేసిన తర్వాత మాత్రమే దీనికి సంబంధించిన వివరాలు బయటకు రావని అధికారులు అంటున్నారు. మొత్తం మీద ధర్మవరంలో ఉగ్రకదలికలు కలకలం రేపాయి. నూర్ ఇంట్లో సోదాలు జరిపిన ఎన్ఐఏ అధికారులు పదహారు సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. దీంతో పాటు నూర్ సోషల్ మీడియా అకౌంట్స్ ను కూడా పరిశీలిస్తున్నారు.