Karnataka : భక్తుల పైకి దూసుకెళ్లిన ట్రక్కు.. ఎనిమిది మంది మృతి
కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మరణించారు
కర్ణాటకలో ఘోర విషాదం చోటు చేసుకుంది. వినాయక నిమజ్జనం సందర్భంగా భక్తులపైకి ట్రక్కు దూసుకెళ్లడంతో ఎనిమిది మంది మరణించారు.ఈ ఘటనలో మరో ఇరవై మందికిపైగానే భక్తులకు గాయాలయ్యాయి. కర్ణాటకలోని హసన జిల్లా హౌళెనరసీపుర తాలూకా మొసళె హౌసహళ్లిలో జరిగింది. జాతీయ రహదారిపై నిమజ్జనానికి వెళుతుండగా ట్రక్కుకు ఒక వాహనం అడ్డురావడంతో దానిని తప్పించే ప్రయత్నంలో డ్రైవర్ నిమజ్జనం ఊరేగింపుపై వాహనంతో దూసుకెళ్లాడు.
వినాయక నిమజ్జనం సందర్భంగా...
వాహనాన్ని తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి ట్రక్కు భక్తులపైకి దూసుకు వచ్చింది. దీంతో ఎనిమిది మంది అక్కడికక్కడే మరణించారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.