దేవుడిపై పగతో దేవాలయాల్లో దోపిడీలు
దేవుడిపై అతడికి పగ.. అందుకే దొంగతనాలకు ఎక్కడికీ వెళ్ళడు!! కేవలం దేవాలయాలకు మాత్రమే వెళుతుంటాడు.
దేవుడిపై అతడికి పగ.. అందుకే దొంగతనాలకు ఎక్కడికీ వెళ్ళడు!! కేవలం దేవాలయాలకు మాత్రమే వెళుతుంటాడు. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్‌కు చెందిన యశ్వంత్ ఉపాధ్యాయ్ ఆలయాలే లక్ష్యంగా గత 15 ఏళ్లుగా దొంగతనాలు చేస్తూ వచ్చాడు. గుళ్లలోని హుండీల కానుకలు, ఆభరణాలు అపహరిస్తూ పోలీసులకు చిక్కకుండా తప్పించుకొంటూ వచ్చాడు. చోరీలకు వెళ్లినపుడు తన బైకులో ఓ జత దుస్తులు అదనంగా పెట్టుకునేవాడు. పని పూర్తికాగానే.. దేవుడికి ఓ దండం పెట్టుకొన్నాక దుస్తులు మార్చుకొని వీధి సందుల గుండా వెళ్లిపోయేవాడు. అయితే ఎట్టకేలకు దొరికిపోయాడు. నిందితుడికి తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయని, దేవుడు తనకే ఎందుకిలా చేశాడన్న కోపంతోనే ఆలయాల్లో మాత్రమే చోరీలకు పాల్పడినట్లు విచారణలో ఒప్పుకున్నాడని పోలీసులు తెలిపారు.