ఖతార్ లో తెలుగు పాస్టర్ల అరెస్ట్

ఖతర్‌లో అనుమతులు లేకుండా మత ప్రచారం నిర్వహించారనే ఆరోపణలపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-06-16 10:00 GMT

ఖతర్‌లో అనుమతులు లేకుండా మత ప్రచారం నిర్వహించారనే ఆరోపణలపై పలువురు క్రైస్తవ మత ప్రచారకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఐదుగురు తెలుగు పాస్టర్లు కూడా ఉన్నారు. రెండు వారాలకు పైగా నిర్బంధంలో ఉంచి విచారించిన అనంతరం వీరిని ఇటీవల విడుదల చేశారు. వీరు దేశం విడిచి వెళ్లేందుకు ఇంకా అనుమతులు మంజూరు చేయలేదు.

దోహాలోని తుమమా అనే ప్రాంతంలో కొందరు వ్యక్తులు అనుమతి లేకుండా మతపరమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం రాగానే అధికారులు మొత్తం 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. ఐదుగురు తెలుగు పాస్టర్లలో ముగ్గురు సందర్శక వీసాలపై ఖతర్‌కు వచ్చి, ఇక్కడ మత ప్రచార కార్యకలాపాల్లో పాల్గొంటున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఖతర్‌లో క్రైస్తవులు ప్రార్థనలు చేసుకునేందుకు బర్వా ప్రాంతంలో ఒక విశాలమైన, ప్రత్యేక కాంపౌండ్ కేటాయించారు. అయితే, కొందరు స్థానిక చట్టాలకు విరుద్ధంగా ప్రైవేటు నివాస స్థలాల్లో, విల్లాల్లో అనుమతి లేకుండా ప్రార్థనలు నిర్వహించారు.

Tags:    

Similar News