ఆస్ట్రేలియాలో ప్రాణాలు కోల్పోయిన ఉజ్వల వేమూరు

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన ఉజ్వల వేమూరు

Update: 2024-03-09 13:01 GMT

ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఎలుకపాడుకు చెందిన ఉజ్వల వేమూరు (23) అనే తెలుగు వైద్యురాలు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో ప్రాణాలు కోల్పోయింది. ఆమె వాగులో పడి ప్రాణాలు కోల్పోయింది. ఉజ్వల తల్లిదండ్రులు వేమూరు మైథిలి, వెంకటేశ్వరరావు ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. ఆమె ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్‌లోని బాండ్ విశ్వవిద్యాలయంలో MBBS డిగ్రీని పూర్తి చేసింది. ఉజ్వల రాయల్ బ్రిస్బేన్ మహిళా ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తూ ఉంది. అయితే ఊహించని ప్రమాదంలో ఉజ్వల ప్రాణాలు కోల్పోయింది.

బ్రిస్బేన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉజ్వల ఆమె స్నేహితులు మార్చి 2, 2024న ట్రెక్కింగ్ కు వెళ్లారు. గోల్డ్ కోస్ట్ హింటర్‌ల్యాండ్‌లోని లామింగ్‌టన్ నేషనల్ పార్క్‌లోని యాన్‌బాకూచీ జలపాతం వద్ద ట్రెక్కింగ్ చేస్తున్నప్పుడు ఉజ్వల 20 మీటర్ల పై నుండి కింద పడి మరణించింది. ఆమె తన కెమెరాను చేజార్చుకుంటున్నాననే భయంతో.. దాన్ని తిరిగి పట్టుకోవాలనే ప్రయత్నంలో ఉండగా ఈ దురదృష్టకర సంఘటన జరిగింది. ఆమె మృతదేహాన్ని వెలికితీసేందుకు రెస్క్యూ టీమ్‌లకు ఆరు గంటలకు పైగా సమయం పట్టింది. శనివారం సాయంత్రంలోగా డాక్టర్ ఉజ్వల భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకువస్తామని, ఆమె తాతయ్య కోరిక మేరకు ఆమె తల్లిదండ్రులు గ్రామంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహిస్తారని కుటుంబ వర్గాలు తెలిపాయి.


Tags:    

Similar News