ప్రియుడితో కలిసి కన్నతల్లిని హత్య చేయించి

ఘటన గురించి సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ అధికారులు

Update: 2025-06-24 07:34 GMT

హైదరాబాద్ జీడిమెట్ల పరిధిలో ఊహించని దారుణ ఘటన చోటు చేసుకుంది. 16 ఏళ్ల అమ్మాయి తన ప్రియుడితో కలిసి తల్లిని హత్య చేయించింది. 16 సంవత్సరాల అమ్మాయి పదో తరగతి చదువుతోంది. ఆమె ప్రియుడు శివ వయసు 19 సంవత్సరాలు. తమ ప్రేమ వ్యవహారంలో తల్లి అంజలి (39) మందలించిందనే కోపంతో శివ, అతని తమ్ముడు యశ్వంత్ (18)తో కలిసి హత్యకు పాల్పడింది. వీరంతా కలిసి అంజలి గొంతు పిసికి, తలపై రాడ్ తో కొట్టి చంపేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన జీడిమెట్ల పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఘటన గురించి సమాచారం అందుకున్న జీడిమెట్ల పోలీస్ స్టేషన్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని, హత్యకు గల కారణాలపై వివరణాత్మక దర్యాప్తు ప్రారంభించారు. ఆ టీనేజ్ అమ్మాయి, ఆమె ప్రియుడు శివ, అతని సోదరుడు ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రాథమిక విచారణ జరుగుతోంది, మరిన్ని వివరాలు త్వరలో వెలువడే అవకాశం ఉంది.


Tags:    

Similar News