Murder Sketch : తేజేశ్వర్ హత్యకు ముందే ప్లాన్...మిస్ అవ్వడంతో రూటు మార్చి?
గద్వాల్ ప్రయివేట్ సర్వేయర్ తేజశ్వర్ హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి
గద్వాల్ ప్రయివేట్ సర్వేయర్ తేజశ్వర్ హత్య కేసులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగు చూశాయి. ఈ మేరకు పోలీస్ ఉన్నతాధికారులు మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ కేసులో నిందితులు ఆరుగురిని అరెస్ట్ చేశామని గద్వాల్ జిల్లా ఎస్పీ చెప్పారు. తిరుమల రావు మామూలోడు కాదని, అతనికి ఐశ్వర్యతో పాటు ఆమె తల్లితోనూ వివాహేతర సంబంధం కొనసాగించాడని ఎస్పీ చెప్పారు. ఐశ్వర్య - తేజశ్వర్ ఎంగేజ్ మెంట్ అయిన వెంటనే హత్యకు ప్లాన్ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడయింది. ఇందుకోసం సుపారీ గ్యాంగ్ ను నియమించారు. వారికి రెండు లక్షల రూపాయలు ఇచ్చింది. తేజేశ్వర్ ను హత్య చేస్తే ఐశ్వర్యతో సంబంధం కొనసాగించవచ్చని తిరుమలరావు ప్లాన్ వేశాడు.
వివాహేతర సంబంధం కొనసాగించాలని...
గద్వాల్ కు చెందిన ఐశ్వర్య తన పెళ్లికి ముందే కర్నూలుకు చెందిన బ్యాంకు ఉద్యోగి తిరుమలరావుతో పరిచయం ఏర్పడింది. తిరుమలరావుకు అప్పటికే పెళ్లికావడం, కాని పిల్లలు లేకపోవడంతో ఐశ్వర్య తో సంబంధాన్ని కొనసాగించాలని నిర్ణయించారు. తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవడానికి తిరుమలరావు, ఐశర్య భారీగా స్కెచ్ వేశారు. తేజేశ్వర్ ను చంపేసి తాము విదేశాలకు జంప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. హత్య చేసిన వెంటనే మృతదేహం లభ్యం కాకముందే తాము లడాఖ్ కు వెళ్లి అక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లి సెటిల్ అవ్వాలని ప్లాన్ చేశారు.ఇందుకోసం సుపారీ గ్యాంగ్ ను సంప్రదించారు. తేజేశ్వర్ ను హత్య చేయడానికి రెండు లక్షల రూపాయలుచెల్లించాడు.
ఆషాఢమాసంలో జంప్ అవ్వడానికి...
సుపారీ గ్యాంగ్ తో పాటు తిరుమలరావు, ఐశ్వర్యను కూడా గద్వాల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆషాఢమాసంలో తిరుమలరావు, ఐశ్వర్య లడాఖ్ వెళ్లాలని ప్లాన్ చేశారు. తిరుమల రావు బ్యాంకు ఉద్యోగం చేస్తూనే గంటల తరబడి ఐశ్వర్య తో వీడియో కాల్ తో మాట్లాడేవాడని పోలీసుల విచారణలో వెల్లడయింది. అయితే తేజేశ్వర్ ప్రయివేటు సర్వేయర్ కావడంతో తమ భూములను సర్వేచేయించాలని చెప్పి తీసుకెళ్లి సుపారీ గ్యాంగ్ చంపేశారని గద్వాల్ ఎస్పీ మీడియాకు వెల్లడించారు. కారులో డ్రైవర్ పక్కన కూర్చున్న తేజేశ్వర్ ను సుపారీ గ్యాంగ్ చంపేసిందని చెప్పారు. తేజేశ్వర్ ను చంపేయడానికి అనేక సార్లు ప్రయత్నించినా కుదరలేదని, చివరకు భూముల సర్వే ఉందనిచెప్పి చంపేశారని తెలిపారు. ప్రధాన నిందితుడు బీటెక్ చదివిన వ్యక్తి అని, ఆధారాలు దొరకకుండా జాగ్రత్తలు తీసుకున్నారని గద్వాల్ ఎస్పీ తెలిపారు. హత్యకు ఉపయోగించిన ఆయుధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.