చైనా యాప్ ల కేసులో ఛార్టెట్ అకౌంటెంట్ అరెస్ట్

చైనా యాప్ ల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతంచేసింది. ఛార్టెట్ అకౌంటెంట్ రవికుమార్ ను అరెస్ట్ చేసింది

Update: 2021-12-03 12:00 GMT

చైనా యాప్ ల కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ విచారణను వేగవంతం చేసింది. ఛార్టెట్ అకౌంటెంట్ రవికుమార్ ను అరెస్ట్ చేసింది. ఫోర్జరీ బిల్లులతో 1100 కోట్ల రూపాయలను రవికుమార్ చైనాకు తరలించినట్లు విచారణలో వెల్లడయింది. ఢిల్లీలో రవికుమార్ ఛార్టెట్ అకౌంటెంట్ గా పనిచేస్తున్నారు.

బోగస్ బిల్లులతో...
బోగస్ బిల్లుల జారీలో రవికుమార్ పాత్ర ముఖ్యంగా ఉందని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ గుర్తించింది. రవికుమార్ ను నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టింది. అయితే విచారణకు తమ కస్టడీకి ఇవ్వాలని కోర్టును ఈడీ కోరింది. ఈ నెల 9వ తేదీ వరకూ రవికుమార్ ను కస్టడీకి అనుమతి ఇస్తున్నట్లు న్యాయస్థానం పేర్కొంది.


Tags:    

Similar News