Road Accident in Jagtial : రోడ్డు ప్రమాదంలో కొడుకు మృతి.. తండ్రికి తీవ్రగాయాలు

తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, తండ్రి తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు

Update: 2024-05-23 04:36 GMT

Road Accident in Jagtial :తెలంగాణలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కుమారుడు మరణించగా, తండ్రి తీవ్రగాయాలపాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగిత్యాల జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నం మండలం ప్రధాన రహదారిపై అర్ధరాత్రి వేగంగా వచ్చిన కారు లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.

లారీని కారు ఢీకొట్టడంతో...
ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న కుమారుడు సాయి అక్షయ్ అక్కడికక్కడే మరణించగా, తండ్రి శివరామకృష్ణ తీవ్రంగా గాయపడ్డారు. తండ్రీ కొడుకులిద్దరూ కారులో హైదరాబాద్ నుంచి మెట్‌పల్లి కి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన శిరామకృష్ణను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


Tags:    

Similar News