అతి పెద్ద డేటా చోరీ కేసును చేధించిన సైబరాబాద్ పోలీసులు.. వివరాలివే

ఈ కేసును దర్యాప్తుకై ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అతిపెద్ద డేటా చోరీ కేసులో..

Update: 2023-03-23 13:18 GMT

Biggest Cyber Crime in India

దేశంలోనే అతిపెద్ద డేటా చోరీ కేసును సైబరాబాద్ పోలీసులు చేధించారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసి.. కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 16.80 కోట్ల మంది డేటా చోరీ అయినట్లు సైబరాబాద్ పోలీసులు గుర్తించారు. ఈ కేసును దర్యాప్తుకై ఐపీఎస్ ఆఫీసర్ ఆధ్వర్యంలో సిట్ ను ఏర్పాటు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ అతిపెద్ద డేటా చోరీ కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ స్కామ్ లో బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డు జారీ చేసే ఏజెన్సీ ఉన్నట్లు గుర్తించామన్నారు. ఈ కేసులో జస్ట్ డయల్ సంస్థపై కూడా కేసు నమోదు చేస్తామని ఆయన తెలిపారు.

నాగపూర్, ముంబై, ఢిల్లీకి చెందిన ముఠా సభ్యులు కలిసి దేశంలోని కోట్ల మంది పర్సనల్ డేటా, గ్యాస్ డేటాను చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. బిల్ పే చేయలేదని, అప్ డేట్ చేయలేదని ప్రజలకు ఫోన్లు, మెసేజ్ లు పంపి.. వారి డేటాను సేకరిస్తారని వివరించారు. అలాగే.. వివిధ కంపెనీలు, బ్యాంకుల్లో ఇన్సూరెన్స్, లోన్ల కోసం అప్లై చేసుకున్న దాదాపు 4 లక్షల మంది డేటా చోరీకి గురైందని స్టీఫెన్ రవీంద్ర వెల్లడించారు. డిఫెన్స్, ఆర్మీ ఉద్యోగుల సెన్సిటివ్ డేటా కూడా చోరీకి గురైందని తేల్చారు. ఫేస్ బుక్, ట్విట్టర్ వాడే 7 లక్షల మంది వ్యక్తిగత డేటా, వారి ఐడీలు, పాస్ వర్డ్ లను సైబర్ నేరగాళ్లు దొంగిలించినట్లు గుర్తించారు. ఇలా మొత్తం దేశంలో 16 కోట్ల 80 లక్షల మంది డేటాను సైబర్ నేరగాళ్లు అమ్మకాలకు పెట్టారని గుర్తించామన్నారు. ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులకు చెందిన డేటా కూడా చోరీకి గురైనట్లు గుర్తించారు.


Tags:    

Similar News