కారులో వెండి బిస్కెట్లు.. ఎక్కడ దాచారంటే?
ఒడిశా ఆబ్కారీ అధికారులు ఓ కారులో ఏర్పాటు చేసిన రహస్య అరను చూసి ఒక్కసారిగా షాకయ్యారు.
ఒడిశా ఆబ్కారీ అధికారులు ఓ కారులో ఏర్పాటు చేసిన రహస్య అరను చూసి ఒక్కసారిగా షాకయ్యారు. అందులో నుండి వెండి బిస్కెట్లు బయటపడ్డాయి. సంబల్‌పూర్ జిల్లా రెంగాలిలో 110 వెండి బిస్కట్లను స్వాధీనం చేసుకున్నారు. మహారాష్ట్ర నుంచి వచ్చిన ఓ కారును తనిఖీ చేయగా సీట్ల కింద ఏర్పాటు చేసిన రహస్య అరలో వెండి బిస్కట్లను దాచి ఉంచారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వెండిని ముంబయి నుంచి రాంచీకి తరలిస్తున్నట్లు తెలిసింది. ఒక్కో బిస్కట్ కిలో బరువు ఉంది. వీటి విలువ బహిరంగ మార్కెట్లో కోటి రూపాయలకి పైగా ఉంటుందని అధికారులు తెలిపారు.