భార్య మిస్ అయిందనుకుంటే.. లవర్ తో కలసి ఏం చేసిందో తెలుసా?

షకీర్, అంజుమ్ ఇద్దరూ భార్యాభర్తలు. తాను ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు బయటుకు వెళ్లి వచ్చే సరికి భార్య కనిపించలేదు.

Update: 2025-04-20 12:44 GMT

భార్య మిస్ అయిందని, కనిపించడం లేదని ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇది మిస్పింగ్ కాదు.. లవర్ తో లేచి పోయిందని తెలుసుకుని పోలీసులే నోళ్లు వెళ్లబెట్టారు. అమయాకుడైన ఆ భర్త ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు భార్య, ప్రియుడి కోసం వెదుకుతున్నారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని అలీఘర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. షకీర్, అంజుమ్ ఇద్దరూ భార్యాభర్తలు. తాను ఒక వివాహ వేడుకలో పాల్గొనేందుకు బయటుకు వెళ్లి వచ్చే సరికి భార్య కనిపించలేదు.

ఇంటికి వచ్చేసరికి...
తాను ఇంటికి వచ్చేసరికి భార్య కనిపించకపోవడంతో పాటు నగలు కూడా కనిపించలేదు. అయితే అంజుమ్ మీద మాత్రం షకీర్ కు ఏమాత్రం అనుమానం రాలేదు. ఎక్కడికో వెళ్లి ఉంటుందని బంధువులందరికీ ఫోన్లు చేశాడు. ఎక్కడకూ రాకపోవడంతో చివరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అయితే భార్యతో పాటువారి నలుగురు పిల్లలు కూడా కనిపించకపోవడంతో అనుమాని వచ్చిన షకీర్ రోరావర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులకు ముందుగానే అనుమానం వచ్చినప్పటికీ బయటపడకుండా దర్యాప్తు ప్రారంభించారు.
ప్రియుడితో కలసి...
ఏప్రిల్ 15వతేదీన జంప్ అయిన అంజుమ్ తన ప్రియుడితో కలసి ఉడాయించేసిందని తెలిసి షాక్ కు గురయ్యాడు. ఇరుకు పొరుగు వారు చెప్పిన వివరాల ప్రకారం తన భార్య అంజుమ్ కోసం స్వయంగా వెదుకులాట ప్రారంభించారు. అయినా దొరకకపోవడంతో చివరకు ఫిర్యాదు చేశారు. లవర్ తో కలసి తాజ్ మహల్ వద్ద అంజుమ్ ఎంజాయ్ చేస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. అయితే అంజుమ్ తో కొన్ని రోజుల నుంచి వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అతనితో కలసి జంప్ అయిందని తెలుసుకున్న పోలీసులు వారిద్దరికోసం గాలిస్తున్నారు. ఆ జంట తాజ్ మహల్ నుంచి ఎక్కడ వెళ్లిందో ఆరా తీస్తున్నారు.


Tags:    

Similar News