Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు స్పాట్ డెడ్

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

Update: 2025-09-30 05:30 GMT

తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల శివారులో జరిగిన ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మరణించారు. రైండు బైకులు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈరోజు తెల్లవారు జామున జరిగిన ఈ ప్రమాదం వారి కుటుంబాల్లో విషాదం నింపింది. దసరా పండగ సమయంలో జరిగిన ఈ ప్రమాదం అంతులేని విషాదాన్ని మిగిల్చింది.

రెండు బైకులు ఢీకొట్టడంతో...
ముగ్గురు యువకులు ఒకే బైకు పై సుల్తానాబాద్ కు వస్తున్నారు. ఎదురుగా వస్తున్న మరొకబైకును ఢీకొట్టారు. ఈ ప్రమాదంతో సుల్తానాబాద్ కు చెందిన రాకేశ్, అభి అక్కడికక్కడే మరణించారు. రఘు, ఆదర్శ్ అనే మరో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయలయిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటన స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News