Road Accident : తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు స్పాట్ డెడ్
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు. రంగారెడ్డి జిల్లా లోని కందుకూరు వద్ద డీసీఎం మిల్లర్ ను ఆటో ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో ఎనిమిది మంది తీవ్ర గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు.
మృతులందరూ...
అయితే ప్రమాదం జరిగిన వెంటనే పోలీసులు ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టు మార్టానికి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులందరూ యాచారం మండలం కురుమిద్దకు చెందిన సత్తెమ్మ, శ్రీనివాస్, శ్రీధర్ లుగా గుర్తించారు. అతి వేగమే ప్రమాదానికి గల కారణమని పోలీసులు ప్రాధమికంగా నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.