Breaking : పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం... పది మంది మృతి
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో పది మంది మరణించారు. ఇరవై నాలుగు మందికి గాయాలపాలయ్యారు. పంజాబ్ రాష్ట్రంలోనిహాజీపూర్ లో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు బోల్తా పడటంతో పది మంది మృతి చెందారు. హాజీపూర్ రోడ్డులో జరిగిన ఈ ప్రమాదంలో అనేక మందికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో...
గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన 24 మందిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. అతి వేగమే బస్సు బోల్తా పడటానికి కారణమని పోలీసులు ప్రాధమికంగా గుర్తించారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీసే పనిలో ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.