Road Accident : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు

Update: 2025-09-13 03:48 GMT

అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు బీభత్సం సృష్టించింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించారు. రోడ్డు దాటుతున్నవారిని ప్రయివేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపారని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరో మహిళకు తీవ్రగాయాలయ్యాయి.

ప్రయివేటు ట్రావెల్ బస్సు...
అన్నమయ్య జిల్లాలోని ఓబులవారిపల్లె మండలం మంగళంపల్లిలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, మరో మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. మృతులు అంకమ్మ, రామచంద్రయ్యలుగా గుర్తించారు. గాయపడిన మరో మహిళను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News